చెల్పూర్లో తడిబట్టలతో కౌశిక్‌రెడ్డి ప్రమాణం
ఎన్టీపీసీ ైప్లెయాష్ వివాదంలో నిప్పు రాజుకున్న ది. ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ వివా దం రోజురోజుకూ ముదురుతున్నది.
- మరోసారి సవాల్ విసిరిన కౌశిక్‌రెడ్డి
- నా నిజాయితీ నిరూపించుకున్న.. నీ సంగతేంది?
- ఫ్లైయాష్ స్కాంపై మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే ప్రశ్న
- టీటీడీ వెంకన్న గుడిలో ప్రమాణం చేయాలని సవాల్
- కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం.. పోలీసుల లాఠీచార్జి
- వీణవంకలో కౌశిక్‌రెడ్డి గృహనిర్బంధం
కరీంనగర్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఎన్టీపీసీ ైప్లెయాష్ వివాదంలో నిప్పు రాజుకున్న ది. ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ వివా దం రోజురోజుకూ ముదురుతున్నది. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విసిరిన ఆరోపణాస్ర్తాలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి. కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ చేసిన ప్రత్యారోపణలపై దీటుగా స్పందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని మంగళవారం వీణవంకలోని తన ఇంటిలో పోలీసులు నిర్భందించారు. ఆయన అక్కడే తడివస్ర్తాలతో బహిరంగంగా ప్రమాణం చేశారు. ఇటు సింగపూర్‌లో ప్రణవ్ను ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రణవ్ ప్రమాణం చేయాలని చెల్పూర్‌కు పెద్దసంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులపై దౌర్జన్యంగా ప్రవర్తించడంతో లాఠీ దెబ్బలు రుచిచూశారు. ఇటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావును మానకొండూర్‌లోని తన ఇంటినుంచి బయటికి రాకుండా పోలీసులు నిర్భందించారు. మూడు గంటలపాటు కొనసాగిన ఈ హైడ్రామా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సవాళ్లు – ప్రతిసవాళ్లు
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ నుంచి ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న ైప్లెయాష్ ఓవర్‌లోడ్ లారీలపై రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పెద్ద ఎత్తున ముడుపులు ముడుతున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి గతంలో ఆరోపించా రు. మంత్రి పొన్నం హైదరాబాద్‌లోని అపో లో వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ స్పందించి మంత్రి పొన్నంపై ఆరోపణలు సరికాదని, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి స్థానికంగా వసూళ్లు చేశాడని, అవినీతికి పాల్పడలేదని హుజూరాబాద్ మండలం చెల్పూర్లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై కౌశిక్‌రెడ్డి స్పందిస్తూ మంగళవారం వీణవంకలోని తన ఇంటి నుంచి చెల్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి వెళ్తుండగా పోలీసులు అక్కడే నిర్భందించారు. దీంతో కౌశిక్‌రెడ్డి ఇంట్లోనే స్నానం చేసి తడివస్ర్తాలతో మీడియా, పోలీసులు, ప్రజల ఎదుట బహిరంగంగా ప్రమాణం చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తాను నమ్ముకున్న వేంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేస్తున్నానని వెల్లడించారు. ఈ వివాదం ఉద్రిక్త తకు దారితీస్తుందని భావించిన పోలీసులు, బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిర్భందించారు. నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ను మాత్రం సింగాపూర్‌లోని ఇంటిలో నిర్బందించిన పోలీసులు, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఆపలేకపోయారు.
చెల్పూర్లో హైడ్రామా..
హుజూరాబాద్ మండలం చెల్పూర్ ఈ ప్ర మాణాల వివాదానికి వేదికైంది. హుజూరాబాద్, జమ్మికుంట ప్రధాన రహదారిలో ఉన్న ఈ గ్రామానికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సం ఖ్యలో చేరుకున్నారు. రహదారిపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీరంగం సృష్టించడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశా రు. కాంగ్రెస్ నాయకులు బందోబస్తుకు వచ్చి న మహిళాకానిస్టేబుళ్లపై దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యం చేయడంతో వారు కిందపడ్డారు. వారిపై మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు బూతుపురాణం మొదలుపెట్టారు. పరిస్థితి అదుపు తప్పుతుందని పోలీసులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ రమేశ్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఉన్నా కాంగ్రెస్ నాయకుల వీరంగం తప్పలేదు. బారికేడ్లను తోసుకుని రహదారిపైకి చేరిన కాంగ్రెస్ నాయకులు మూడు గంటల పాటు నానా హంగామా చేశారు.
అవినీతి జరగలేదని నిరూపించుకో..
వీణవంకలోని తన ఇంటి వద్ద తడివస్త్రాలతో మీడియా ముందుకు వచ్చిన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తాను నమ్ముకున్న వెంకటేశ్వరస్వామి కండువా, ఆంజనేయ స్వామి చిత్రపటాలను పట్టుకుని ప్రమాణం చేసి చెబుతున్నానని, తాను ఎవరి వద్ద వసూళ్లకు పాల్పడలేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు తన నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. బాధ్యతగల ఎమ్మెల్యేగా చెల్పూర్‌కు లా అండ్ ఆర్డర్ సమస్య కావొద్దని పోలీసు చెప్తే ఇంట్లోనే ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. ైప్లెయాష్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడినట్టు తాను బహిరంగంగానే ఆరోపించినా ఎందుకు స్పం దించలేదని ప్రశ్నించారు. మంత్రికి మరో అవకాశం ఇస్తున్నానని, తనతో కలిసి హైదరాబాద్ అపోలో వెంకటేశ్వరస్వామి గుడికి రావాలని, రూ.100 కోట్ల అవినీతి చేయలేదని నిరూపిస్తే, తాను బహిరంగ క్షమాపణ చెబుతానని స్పష్టంచేశారు.
ఓవర్ లోడ్‌తో ప్లెయాష్ లారీలు పోవడంలేదని చెప్పే దమ్ము, ధైర్యం మంత్రికి ఉన్నదా? అని ప్రశ్నించారు. పొన్నం బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ‘ప్రభు త్వం మీదేనని పోలీసులతో నన్ను అరెస్ట్ చేయొద్దని, మీరు అరెస్ట్ కావొద్దని, ఇద్దరమే గుడిలోకి వెళ్లి స్నానం చేసి, తడి బట్టలతో ప్రమాణం చేద్దామని, ఇందుకు సిద్ధమేనా?’ అని కౌశిక్‌రెడ్డి సవాల్‌చేశారు. చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న జమ్మికుంట ఎస్సైపైకి కాంగ్రెసోళ్లు గూండాల్లాగా వెళ్లారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన కాంగ్రెస్ గూండాలపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ సీపీని కౌశిక్‌రెడ్డి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

