MLA Kishore Kumar | సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నది : ఎమ్మెల్యే కిశోర్ కుమార్
MLA Kishore Kumar | సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నది. ప్రతిపక్షాలు విమర్శించే స్థాయి లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగు తున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు.
యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నది. ప్రతిపక్షాలు విమర్శించే స్థాయి లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగు తున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. గురువారంయాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సతీమణి కమల పుట్టినరోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. స్వామి వారి ఆశీస్సులు కేసీఆర్ పై ఉండాలని, కేసీఆర్ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
సాధారణ ఎన్నికలకు వెళ్లేందుకే తాము సిద్ధంగా ఉన్నామని, జమిలి ఎన్నికలు స్పష్టత లేదన్నారు. పార్లమెంట్ కమిటీ జమిలి పై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

