Harish Rao | పతంగులకు దారం ఆధారం.. పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం : హరీశ్‌రావు
Harish Rao | రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే పతంగులు ఎగురవేస్తారని, ఆ పతంగులకు దారం ఆధారమైతే, పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | సిద్దిపేట : రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే పతంగులు ఎగురవేస్తారని, ఆ పతంగులకు దారం ఆధారమైతే, పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద కైట్ ఫెస్టివల్‌ను హరీశ్‌రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో మూడు రోజుల పాటు కన్నుల పండువగా పతంగుల పండగ జరుగుతుందన్నారు. మకర సంక్రాంతి అనేది శీతాకాలపు అధికారిక ముగింపు అని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను నిర్వహించుకోవాలని సూచించారు. ప్రశాంతమైన ఆకాశంలో ఎత్తుగా ఎగురుతున్న వివిధ రంగుల గాలిపటాలను చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉందన్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తయారుచేసే బెల్లం, నువ్వుల గింజలతో లడ్డూలు తయారు చేయబడతాయి. ఈ లడ్డూలు తింటే శరీరంలో వేడి వస్తుందని నమ్ముతాం. కాబట్టి సంవత్సరంలో ఈ అత్యంత శీతల సమయానికి తగిన ఆహారం అని పేర్కొన్నారు. చివరికి ఈ ప్రత్యేక రోజున, ప్రజలు గాలిపటాలు ఎగురవేసే విధంగా వినోద కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. ఈ సంప్రదాయం చాలా పరిణామం చెంది ఇవాళ గాలిపటాలు ఎగరేసే టోర్నమెంట్ల దాకా వచ్చింది. యువత పతంగి పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలి. యువత ప్రతి అంశంలో స్ఫూర్తిగా నిలవాలి అని హరీశ్‌రావు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

