Vinayakanagar | వాష్ రూమ్‌కు వెళ్లిన మహిళపై దాడి .. గోల్డ్చైన్తో పరారైన దుండగుడు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ వాష్ రూమ్‌కు వెళ్లడాన్ని గమనించిన దుండగుడు ఆమె పై దాడి చేశాడు.
వినాయక నగర్, జూన్, 25 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ వాష్ రూమ్‌కు వెళ్లడాన్ని గమనించిన దుండగుడు ఆమె పై దాడి చేశాడు. ఆమె అరిచేలోపే సదరు మహిళ మెడలోని 5 తులాల బంగారు గొలుసు తెంచుకొని పరారయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆర్య నగర్ ప్రాంతంలో గల ఎఫ్‌సీఐ కాలనీలో నివాసముండే కొట్టే నాగమణి అనే మహిళ బుధవారం అర్ధరాత్రి సుమారు 2గంటల సమయంలో తమ ఇంటి బయట ఉన్న వాష్ రూమ్‌కు వెళ్లేందుకు ఇంట్లోంచి బయటకు వచ్చింది.
అదే సమయంలో అక్కడ మాటు వేసి ఉన్న ఓ దుండగుడు ఆమె మెడలోని ఐదు తులాల బంగారు పుస్తెలతాడు తెంచుకొని పరాయ్యాడు. నగామణి గట్టిగా అరవడంతో కాలనీవాసులు మేల్కొని పోలీసులకు సమాచారం అందించారు. కాలనీవాసులు, పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించి దుండగుడిని పట్టుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న దుండగుడు నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటాడని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

