ఓయూలో బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి మంత్రుల భూమిపూజ
Osmania University | ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూ. 39.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి భూమి పూజ చేశారు. ఈ
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూ. 39.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, ఓయూ వీసీ రవీందర్ యాదవ్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాటు ఓయూ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో అత్యాధునిక వసతులతో 2.76 ఎకరాల్లో రూ.39.50 కోట్ల అంచనా వ్యయంతో, 1,06,292 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 3 అంతస్థుల్లో 500 మంది విద్యార్థులకు వసతి కల్పించే ఈ హాస్టల్‌ను ఏడాదిలోపు అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఓయూలో 24 హాస్టళ్లు ఉండగా, ఇందులో బాయ్స్ (12), ఉమెన్స్ (12). వర్సిటీలో 70శాతానికి పైగా అమ్మాయిలే ఉండటంతో బాలుర హాస్టల్‌ను గతేడాది అమ్మాయిలకు కేటాయించారు. అబ్బాయిలు ఉండేందుకు హాస్టళ్లు లేకపోవడంతో నూతన హాస్టల్ నిర్మాణానికి టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారులు టెండర్లు పూర్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

