దళితబంధు లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ

కరీంనగర్ : దళిత బంధు లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాలుగు యూనిట్ల వాహనాలు అందజేశారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో దళిత బంధు లబ్దిదారులకు మంత్రులు వాహనాలను అందజేశారు. లబ్దిదారులు దాసారపు స్వరూప రాజయ్య దంపతులకు ట్రాక్టర్, ఎలుకపల్లి కొమరమ్మ – కనకయ్య దంపతులకు ట్రాక్టర్, జి సుగుణ – మొగలి దంపతులకు ట్రాలీ, రాచపల్లి శంకర్ కు మారుతి కారును మంత్రులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దళితుల సంక్షేమానికి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా, నిబద్దతతో పనిచేస్తుందని దీనికి చక్కని ఉదాహరణ దళిత బంధు పథకం అన్నారు. నిన్నటి వరకు డ్రైవర్గా పని చేసిన దళితుడు ఇవాళ అదే వాహనానికి ఓనర్ గా మారడం దళిత బంధు గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. దళిత బంధును కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ నెల 16 న ప్రారంభించి ఇదే నెలలో లబ్ధిదారులకు వాహనాలు అందజేయడం అభినందనీయం అన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని 21 వేల దళిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని మంత్రులు తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వీలు కల్పిస్తుందన్నారు. మొదటి విడుతగా దళిత బంధు ప్రారంభోత్సవంలో 15 చెక్కులను సీఎం అందించారని, నాలుగు యూనిట్ల క్రింద నేడు లబ్ధిదారులకు 2 ట్రాక్టర్లు, ఒక ట్రాలీ, ఒక కారు అందజేసినట్లు తెలిపారు. దళిత బంధు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం, ధైర్యం దళితుల్లో కనబడిందని మంత్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, రవాణా శాఖ ఉప కమిషనర్ ఎం.చంద్ర శేఖర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

