Minister Vemula | సర్వమత సమానత్వం సీఎం కేసీఆర్ విధానం : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
Minister Vemula | సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ పాలనలో సర్వమత సమానత్వాన్ని అమలు చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని క్రైస్తవ చర్చీల అభివృద్ధికి మంజూరైన రూ.2.25 కోట్ల నిధుల ప్రోసిడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం అయా చర్చీల ఫాదర్లకు అందజేశారు.
నిజామాబాద్ సెప్టెంబర్ 28 : సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ పాలనలో సర్వమత సమానత్వాన్ని అమలు చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని క్రైస్తవ చర్చీల అభివృద్ధికి మంజూరైన రూ.2.25 కోట్ల నిధుల ప్రోసిడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం అయా చర్చీల ఫాదర్లకు అందజేశారు. వేల్పూర్ మండలం లక్కోరా వద్ద గలలేఎన్జీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 2 వేల మందికి పైగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అన్ని మతాలకు సమ ప్రాధాన్యమిస్తుందన్నారు. త్యాగం, సేవ, విశ్వాసానికి ప్రతీక క్రైస్తవ మతమని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలో చర్చిల అభివృద్దికి, సౌకర్యాల కల్పనకు గతంలో భారీగా నిధులు ఇచ్చామని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఇప్పుడు మరో రూ.2.25 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి తీసుకోచ్చామని చెప్పారు.
మిగతా చర్చీల అభివృద్ధికి సైతం నిధులను తెచ్చే బాధ్యత తనపై ఉందన్నారు. గతంలో సెక్రెటేరియట్‌లో గుడి, మసీదు మాత్రమే ఉండేవని, చర్చిని కూడా నిర్మించడం ద్వారా సీఎం కేసీఆర్ సర్వమత సమానత్వాన్ని చాటారన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటు కోసం క్రైస్తవులు నిత్యప్రార్థనలు చేశారని గుర్తుచేశారు.
అంతకు ముందు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మరోసారి ఘన విజయం సాధించాలని, మంత్రి వేముల మాతృమూర్తి ఆరోగ్యం బాగుండాలని ఫాదర్లు, దైవజనులు ఆశీర్వదిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డి.రాజేశ్వర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

