ఆరు తడి పంటలే వేయండి
ప్రస్తుత ఎల్ నినో కారణంగా రాష్ట్రంలోని రైతులందరూ యాసంగిలో ఆరు తడి పంటలే సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘రైతు పొలాల్లోకి ఆవిషరణలు’ అనే కార్యక్రమాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచమంతా ఎల్ నినో ప్రభావం ఉన్నదని తెలిపారు. దానిని సమిష్టిగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. రానున్న నెలల్లో తాగునీటికి సైతం చాలా ఇబ్బందులు ఏర్పడుతాయని చెప్పారు.
- రైతులకు మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తేతెలంగాణ): ప్రస్తుత ఎల్ నినో కారణంగా రాష్ట్రంలోని రైతులందరూ యాసంగిలో ఆరు తడి పంటలే సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘రైతు పొలాల్లోకి ఆవిషరణలు’ అనే కార్యక్రమాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచమంతా ఎల్ నినో ప్రభావం ఉన్నదని తెలిపారు. దానిని సమిష్టిగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. రానున్న నెలల్లో తాగునీటికి సైతం చాలా ఇబ్బందులు ఏర్పడుతాయని చెప్పారు.
‘రైతు పొలాల్లోకి ఆవిషరణలు’ అనే కార్యక్రమంతో కేంద్రప్రభుత్వం చేపట్టిన ఖేత్ బచావో అభియాన్ కూడా విస్తృత స్థాయిలో రైతాంగానికి చేరువ కావాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తల ఫలాలు రైతులకు చేరువ కావడంలో ఇంకా లోటుపాట్లున్నాయని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా వాటిని భర్తీ చేయాలని కోరారు. యూరియా వాడకాన్ని ఇంకా తగ్గించి భూమి సారాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. వర్సిటీలో బోధన సిబ్బంది నియామకాలు, పీజీ, పీహెచ్డీ విద్యార్థుల స్కాలర్‌షిప్పుల పెంపు అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఐకార్ సంస్థల ఉన్నతాధికారులు ఈ సందర్భంగా రైతాంగానికి సూచించారు.
పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలి
పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం మారెటింగ్శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో పత్తి సాగు, ఉత్పత్తి అంచనాలు, మారెట్ ధరలు, సీసీఐ కొనుగోళ్లకు చేసిన ఏర్పాట్లు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై సమీక్షించారు. పత్తి కొనుగోళ్ల కోసం 133 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

