Global Rice Summit | ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి తుమ్మల
హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సదస్సును (Global Rice Summit) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరుగుతున్న ఈ సదస్సులో భారత్ సహా 30 దేశాలు పాల్గొన్నాయి.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సదస్సును (Global Rice Summit) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరుగుతున్న ఈ సదస్సులో భారత్ సహా 30 దేశాలు పాల్గొన్నాయి. శాస్త్రవేత్తలు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతోపాటు 250 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్‌లో వరిసాగు, ఉత్పత్తి, నాణ్యత, విదేశీ ఎగుమతుల పెంపుపై చర్చించనున్నారు. టెక్నాలజీ, మార్కెటింగ్, ఆహార భద్రత లక్ష్యాలుగా మేధోమథనం జరుగనుంది.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమన్నారు. ఇటీవలే దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో రైస్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని వెల్లడించారు. తెలంగాణలో క్రమంగా ధాన్యం ఉత్పత్తి పెరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నదని పేర్కొన్నారు. ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. అందరికీ ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
తెలంగాణ వరి ఉత్పత్తి థాయ్‌లాండ్‌తో సమానం..
తెలంగాణ వరి ఉత్పత్తి థాయ్‌లాండ్‌తో సమానమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమది రైతు అనుకూల ప్రభుత్వమని చెప్పారు. వ్యవసాయానికి అన్ని రకాలుగా ప్రభుత్వం మద్దతు ఇస్తున్నదని తెలిపారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు సేకరిస్తున్నదని వెల్లడించారు. వివిధ పథకాల కింద పౌషికాహారం పొర్టిఫికేషన్ బియ్యం సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 వేల అత్యాధునిక రైస్ మిల్లులు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో నీటిపారుదల వనరులు పెరుగుతున్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

