యాసంగిలో వరి వేయొద్దు
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో వరి వేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. ముఖ్యంగా నీటి లభ్యత తకువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు చేయకుండా, తకువ నీటితో పండే ఆరుతడి, స్వల్పకాలిక పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శనగ, పెసర, మినుము, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి పంటలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
- ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి
- ఎల్ నినో ప్రభావంపై రైతులు,
- జిల్లా కలెక్టర్ల సదస్సులో మంత్రి తుమ్మల
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో వరి వేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. ముఖ్యంగా నీటి లభ్యత తకువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు చేయకుండా, తకువ నీటితో పండే ఆరుతడి, స్వల్పకాలిక పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శనగ, పెసర, మినుము, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి పంటలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
సోమవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, రైతులతో నిర్వహించిన సదస్సులో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార, మంత్రి తుమ్మల పాల్గొని ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, యాసంగి పంటల ప్రణాళికపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, నీటి నిల్వలు పడిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, పంటల పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకునేలా అధికారులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. యాసంగిలో రైతులు వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
పప్పుధాన్యాలు, నూనెగింజల విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు మారెటింగ్ సదుపాయాలు, కొనుగోలు అవకాశాలు ఉండేలా వ్యవసాయ, మారెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేవిధమైన పరిస్థితులు లేవని, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో నీటి లభ్యతను బట్టి పంటల ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఐఎండీ, ఇరిగేషన్, భూగర్భజల శాఖ, విద్యుత్తు శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న వాస్తవ సమాచారాన్ని రైతులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సీఎస్ సంజయ్ జాజు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, వివిధ శాఖల కార్యదర్శులు, డైరెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల వైస్ చాన్స్లర్లు, శాస్త్రవేత్తలు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,600 రైతు వేదికల నుంచి వేలాది మంది రైతులు పాల్గొన్నారు.
సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు రైతులు దూరం
- నారాయణపేట జిల్లా మక్తల్‌లో అన్నదాతల డుమ్మా
మక్తల్, అక్టోబర్ 12 : ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గి పంటలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో యాసంగి సీజన్లో పంటలు సాగు చేయరాదని సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌కు నారాయణపేట జిల్లా మక్తల్‌లో రైతుల నుంచి ఆదరణ కరువైంది. జక్లేర్, రుద్ర సముద్రం, గడ్డంపల్లి రైతు వేదికల్లో మండల వ్యవసాయాధికారి మిథున్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రైతులెవరూ హాజరుకాలేదు. కేవలం అధికారులు మాత్రమే ఉండగా.. వీసీలో ప్రభుత్వ అధికారులు చెప్పే మాటలు విన్నారు. జక్లేర్‌లో కేవలం అధికారి మిథున్ చక్రవర్తి, వ్యవసాయ విస్తరణ అధికారి మాత్రమే పాల్గొన్నారు. గడ్డంపల్లిలో వ్యవసాయ విస్తరణ అధికారి విజయ్ పాల్గొని కార్యక్రమాన్ని ముగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

