Talasani Srinivas Yadav | కాంగ్రెస్ పార్టీవి ఆచరణ సాధ్యం కాని హామీలు: మంత్రి తలసాని
కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని ప్రశ్నించారు. వారి చరిత్ర ఎవరికి తెలయదని, ఆ పార్టీని తెలంగాణలోని (Telangana) కానీ, దేశంలో కానీ ఎవరూ నమ్మే స్థితిలో లేరని విమర్శించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని ప్రశ్నించారు. వారి చరిత్ర ఎవరికి తెలయదని, ఆ పార్టీని తెలంగాణలోని (Telangana) కానీ, దేశంలో కానీ ఎవరూ నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. హైదరాబాద్ గోషామహల్లో బీసీ కులవృత్తిదారులకు ఆర్ధిక సహాయం పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఓట్లు దండుకోవడం తప్ప ఏరోజూ ప్రజల గురించి కాంగ్రెస్ ఆలోచించలేదన్నారు. 50 ఏండ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించారని, అప్పుడు పేదలకు పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదా అని నిలదీశారు.
గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇండ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రూ.3 లక్షలు ఇస్తుంటే.. వాళ్లు రూ.6 లక్షలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సబబన్నారు. ఆ పార్టీ నాయకులు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు, అలవికాని హామీస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలే ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశారని చెప్పారు. ఆ పార్టీ ప్రకటించే డిక్లరేషన్లు కనీసం మూతి తూడ్చుకోవడానికి కూడా పనికిరావని ఎద్దేవా చేశారు. అన్నివర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని చెప్పారు. వచ్చే నెల 2న 12 వేల డబుల్‌బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

