Mahabubnagar | లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Srinivas Goud | మహబూబ్‌నగర్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి, ఎర్రగుంట, తదితర లోతట్టు ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు.
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి, ఎర్రగుంట, తదితర లోతట్టు ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. మోకాలు లోతు నీళ్లలో దిగి ప్రజల సమస్యలను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
వర్ష బాధితులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. గత 2 రోజులుగా ఎప్పుడు లేనంత వర్షం కురవడం వల్ల పెద్ద ఎత్తున వర్షపు నీరు వస్తున్నదని మంత్రి తెలిపారు. నిర్వాసితులకు పునరావాసం కోసం ప్రత్యేకంగా 3 ఫంక్షన్ హాల్స్ వద్ద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఒకప్పుడు చెరువులు ఎండిపోయి ఉండేవని, గత కొన్నేండ్లుగా పచ్చదనం పెరిగి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆయన తెలిపారు. వరద ముంపు నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇండ్లలో ఉండకుండా ఫంక్షన్ హాల్స్ వద్దకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులు ఆదేశించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

