ఖిలాషపూర్ కోట పునరుద్ధరణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన

జనగామ : జిల్లాలోని ఖిలాషపూర్‌లో బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన చారిత్రాత్మక కోట పునరుద్ధరణ పనులను స్థానిక ఎమ్మెల్యే డా. రాజయ్యతో కలసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. అనంతరం కోట గతంలో జరిగిన పనులను పరిశీలించారు. కోట అభివృద్ధిపై పురావస్తు శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. కోట పునరుద్ధరణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బహుజనుల చక్రవర్తి పాపన్న నిర్మించిన కోటల సంరక్షణకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యాటకశాఖ చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా జాఫర్ ఘడ్, తాటికొండ, భువనగిరి కోటలతో పాటు చరిత్రాత్మక కోటల పరిరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్‌లో పాపన్న నిర్మించిన కోటకు గ్రానైట్ తవ్వకాల వల్ల నష్టం జరుగుతుందని తెలవడంతో విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒక్కరోజు లొనే గ్రానైట్ లీజులను రద్దు చేసినట్లుగా చెప్పారు. పాపన్న కోటను పురావస్తు పార్క్ గా అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని చారిత్రాత్మక కోటల రక్షణ కు కనీస చర్యలు చేపట్టలేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేసి వాటి సంరక్షణకు, భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా ఉండేలా తీర్చిదిద్దేoదుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి, ఆంథోల్ శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, జిల్లా కలెక్టర్ నిఖిల, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

