Sridhar Babu | బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు.
నిర్మల్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి సన్నిధికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే మహంకాళి, దత్తాత్రేయ స్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం వసతి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రికి నిర్మల్ పెయింటింగ్స్ చిత్రపటం బహుకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తోందని, బాసర నూతన ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మాస్టర్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో కోమల్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ పాఠక్, ఈవో సుదర్శన్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

