Satyavathi Rathod | కేసీఆర్ పేరు పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
Satyavathi Rathod | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చాటుకున్నారు. తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు సత్యవతి రాథోడ్. గిరిజన యోధుడు కొమురం భీం సహచరుని వారసులతో మంత్రి సత్యవతి పచ్చబొట్టు వేయించుకున్నారు.
Satyavathi Rathod | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చాటుకున్నారు. తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు సత్యవతి రాథోడ్. గిరిజన యోధుడు కొమురం భీం సహచరుని వారసులతో మంత్రి సత్యవతి పచ్చబొట్టు వేయించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారహిల్స్, రోడ్ నెం10 లోని బంజారా భవన్లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆదివాసీ, బంజారాలు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆదివాసీ బంజారాలు సిద్ధం చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు.
అయితే పచ్చబొట్టు స్టాల్ కనిపించడంతో మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయాలని కోరారు. నిర్వహకులు పచ్చబొట్టు నొప్పితో కూడినది అని చెప్పినా, మంత్రి కేసీఆర్ పేరును వేయాలి అని వారికి తెలిపారు. నొప్పిని భరిస్తూ కేసీఆర్ పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నారు సత్యవతి.
కొమురం భీం సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి మంత్రికి పచ్చబొట్టు వేశారు. దీంతో ఆమెను అభినందించి, నగదు బహుమానం అందించారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతులను ప్రోత్సాహించాలని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చాటుకున్నారు. తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు సత్యవతి రాథోడ్. pic.twitter.com/pwqol92FFL
— Namasthe Telangana (@ntdailyonline) June 10, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

