Nikhat Zareen | నిఖత్ జరీన్ కు మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు
Nikhat Zareen | వరుసగా మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో రెండోసారి ఛాంపియన్ షిప్ టైటిల్‌ను గెలిచిన నిఖత్ జరీన్(Nikhat Zareen)కు రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అభినందనలు తెలిపారు.
వరంగల్ : వరుసగా మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో రెండోసారి ఛాంపియన్ షిప్ టైటిల్‌ను గెలిచిన నిఖత్ జరీన్(Nikhat Zareen)కు రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అభినందనలు తెలిపారు. ఆదివారం ఐబీఏ మహిళ ప్రపంచ బాక్సింగ్(Womens World Boxing) 50 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో నిఖత్ జరీన్ వియత్నం దేశానికి చెందిన న్గుయెన్ థి టామ్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించారు.
ఈ పోటీల్లో శక్తివంతమైన పంచ్‌లతో ప్రత్యర్థిని మట్టికరిపించి బంగారు పతకం కైవసం చేసుకోవడం అభినందనీయమని మంత్రి అన్నారు. తెలంగాణ గౌరవాన్ని చిరస్థాయిలో నిలిచిపోయేలా నిఖత్ ప్రతిభను కనబరిచారని కొనియాడారు. ఐబీఏ ఛాంపియన్‌షిప్‌లో రెండో సారి విజేతగా చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. ఆమె విజయపరంపరను ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, యువ క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని తెలిపారు. నిఖత్ జరీన్ విజయం యావత్ భారత జాతి తెలంగాణ బిడ్డ ప్రతిభను చూసి గర్విస్తోందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

