Heavy rains | వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి : మంత్రి సత్యవతి రాథోడ్
Heavy rains | ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులు ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులు ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.
సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుత సమయంలో ఎవరు కూడా సెలవుల్లో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తతో విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా సత్వర చర్యలు తీసుకోవాలని, వరద ఉధృతి తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ లకు వర్ష ప్రభావిత ప్రాంతాల నుండి ఏదైనా సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని సమాయత్తపర్చాలని మంత్రి అధికారులకు తెలిపారు.విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని పలు ప్రాంతాలలో కుంభవృష్టి కురియడంతో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తునందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా చేపలు పట్టే వారు, ఈత సరదా కోసం పిల్లలు, యువత చెరువులు, వాగులోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

