60 ఏండ్ల సమస్య.. రెండే రోజుల్లో పరిష్కరించిన మంత్రి సత్యవతి
Satyavathi rathod | రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పోర్లగడ్డ తండాకు మొదటిసారి బస్సు వచ్చింది. దీంతో గిరిజన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా పోర్లగడ్డ తండాకు మంత్రి సత్యవతి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా గడపగడపకు ప్రచారం నిర్వహించి అక్కడి గిరిజన ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.
సంస్థాన్ నారాయణపురం: రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పోర్లగడ్డ తండాకు మొదటిసారి బస్సు వచ్చింది. దీంతో గిరిజన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా పోర్లగడ్డ తండాకు మంత్రి సత్యవతి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా గడపగడపకు ప్రచారం నిర్వహించి అక్కడి గిరిజన ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.
ఈ క్రమంలో గ్రామానికి బస్సు లేక ప్రజలు, కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ తండా వాసులు మంత్రి ముందు వాపోయారు. స్పందించిన మంత్రి ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి తక్షణమే బస్సు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇబ్రహీంపట్నం నుంచి పోర్లగడ్డ తండా వరకు బస్సును ఏర్పాటు చేయించారు. మొదటి సారి తండాకు బస్సు రావడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 60ఏండ్ల సమస్యను రెండు రోజుల్లోనే పరిష్కరించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ అరుణేష్, వైస్ ఎంపీపీ రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు కుమార్, వార్డ్ మెంబర్స్ సభవత్ రాజు, మాజీ సర్పంచ్ బిచ్చ నాయక్, తండా ప్రజలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

