Minister Sabita Indra Reddy | ఇంటర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల పనులు సత్వరమే పూర్తి చేయాలి : మంత్రి సబిత
Minister Sabita Indra Reddy | రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాశాలల్లో అవసరమైన నూతన భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఇంటర్మీడియట్ విద్య పై సమీక్ష నిర్వహించారు.
విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పూర్తి కాకపోవడంతో ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షించాలని ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్కు సూచించారు. కళాశాల నిర్వహణ అవసరాలకోసం, ల్యాబ్ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో రూ. 4 .43 కోట్లు మంజూరు చేశామని, వీటిని వెంటనే చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయడానికి కేవలం ఆర్టీసీ పైనే ఆధారపడకుండా ప్రైవేట్ ఆపరేటర్ల సహాయంతో శుక్రవారం నాటికి చేరేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందిస్తున్న మన రాష్ట్రంలో ప్రవేశాల సంఖ్య తగ్గిందనే విషయంలో ఆరోపణలు వస్తున్నాయని, ఇది నిజం కాదని పేర్కొన్నారు. 119 జ్యోతిరావు పూలే పాఠశాలలను, 38 కెజిబివిలను, 2 గిరిజన గురుకులాలను ఇంటర్మీడియేట్ వరకు అప్ గ్రేడ్ చేశామన్నారు.
వీటిలో కొంత మంది విద్యార్థులు చేరారని మంత్రి పేర్కొన్నారు. ప్రవేశాల తుది గడువు ఇంకా పూర్తి కాలేదని, గడువు ముగిసే నాటికి గత సంవత్సరంతో పోలిస్తే అధిక ప్రవేశాలు జరుగుతాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మారుమూల జిల్లాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తుండగా అన్ని వనరులు ఉండి కూడా ఈ మూడు జిల్లాలు వెనుకబడి ఉండటం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, వివిధ జిల్లాల ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

