సలహాలిస్తే తీసుకుంటం
కేసీఆర్ సలహాలు ప్రభుత్వ ం పరిగణనలోకి తీసుకుంటుంది. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల నీళ్లు ఇచ్చారో చెప్పాలి. ఏడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు.. పదేండ్ల పాలనపై చర్చకు సిద్ధమా?
కేసీఆర్ సలహాలు ప్రభుత్వ ం పరిగణనలోకి తీసుకుంటుంది. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల నీళ్లు ఇచ్చారో చెప్పాలి. ఏడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు.. పదేండ్ల పాలనపై చర్చకు సిద్ధమా?
– మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజాపాలనకు అద్దం
ఆర్థిక మంత్రి భట్టి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రజాపాలనకు అద్దం పట్టేలా ఉన్నది. ఆరు గ్యారెంటీలకు నిధులు కేటాయించారు. కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ముస్లింలకు మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ముస్లింలను మోసం చేసింది. అధికారంలోకి వస్తే ముస్లింల సంక్షేమానికి రూ.4 వేల కోట్లు, స్వయం ఉపాధికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్లో కేవలం రూ.3003 కోట్లే కేటాయించడం సరికాదు. సబ్‌ప్లాన్ హామీని కూడా విస్మరించారు.
– ఇంతియాజ్ ఇసాక్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్
ఈ బడ్జెట్ సంతోషదాయకం
రాష్ట్రానికి రూ.6 లక్షల 71 వేల కోట్లు అప్పు ఉన్నా.. రూ.2. 91లక్షల కోట్లతో బడ్జెట్ తయారు చేయడం సానుకూలం. వ్యవసాయ రంగానికి రూ.72వేల కోట్లు కేటాయింపులు చేయడం రైతాంగంపై ప్రభుత్వానికి ఉన్న సానుకూలతకు అద్దం పడుతున్నది. విద్యా, వైద్యరంగాలకు మరికొంత కేటాయింపులు పెంచాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అసంఘటిత రంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
-కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే
కేటాయింపులను స్వాగతిస్తున్నాం
వ్యవసాయం, దళిత, గిరిజన, విద్య, వైద్యరం గాలకు కేటాయి ంపులను స్వాగతిస్తున్నాం. ఇండ్ల నిర్మాణానికి బీసీలకు రూ.5 లక్షలు, దళితులకు రూ.6 లక్షలు , నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయిస్తామని ప్రకటించి రూ.8424 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇండ్ల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలి. మహిళలకు వడ్డీలేకుండా రూ.2లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలి
– తమ్మినేని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
గాడిద గుడ్డు.. బడ్జెట్
కాంగ్రెస్ బడ్జెట్లో 6 గ్యారెంటీలకు నిధులు గాడిద గుడ్డేనా? రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్‌కు బడ్జెట్లో పైసా కేటాయించలేదు. రంజాన్‌కు రూ.33 కోట్లు కేటాయించి.. హిందువుల పండుగలకు నయాపైసా కేటాయించకపోవడం మతతత్వం కాదా ? మహాత్ముడి వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి.
-బండి సంజయ్, కేంద్ర మంత్రి
నిరాశపరిచింది
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను బడ్జెట్ నిరాశ పరిచింది. ఐదు విడతల కరువుభత్యం విడుదల డిమాండ్‌ను పట్టించుకోకపోవడం అన్యాయం. మధ్యంతర భృతి ప్రస్తావన లేదు. ఈహెచ్ఎస్ బలోపేతం చేస్తామని హామీ ఇచ్చినా ప్రస్తావించలేదు. బడ్జెట్లో ఎకడా ఉద్యోగుల సంక్షేమం కనపడలేదు. వివక్ష మాత్రమే ఉన్నది.
– దేవీప్రసాద్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
పాలసీ లేదు.. పథకం లేదు
రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాలకు నిరాశే ఎదురైంది. రైతులనే కాదు, కౌలు రైతులు, రైతు కూలీలనూ కాంగ్రెస్ మోసం చేసింది. రైతు భరోసా, దళిత బంధు, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు భరోసాకు కేటాయింపులే లేవు. ఇది పూర్తిగా ‘రైతు వ్యతిరేక ప్రభుత్వం’. పాలసీపై స్పష్టత లేదు. ఒక్క కొత్త సంక్షేమ పథకాన్నీ ప్రకటించలేదు.
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
దివాలా తీయించే బడ్జెట్
ఇది రాష్ట్రాన్ని దివాలా తీయించే బడ్జెట్. అభివృద్ధి మచ్చుకైనాలేదు. బడ్జెటులో రాష్ట్ర ఆదాయాన్ని రూ. రెండు లక్షల 21 వేలకు పైగా చూపారు. గత ఏడాది ఆదాయం రూ.లక్షా 69 వేల కోట్లు మాత్రమే. మిగిలిన రూ.52 వేల కోట్ల అదనపు ఆదాయం ఎలా సాధ్యమో ఆర్థిక మంత్రి చెప్పాలి.
– ఏలేటి మహేశ్వరెడ్డి , బీజేపీ శాసనసభాపక్షనేత
పెన్షన్లు లేవు.. కొలువుల్లేవు
ప్రస్తుత బడ్జెట్లో కొత్త పెన్షన్లు, కొత్త ఉద్యోగాల భర్తీకి నిధుల కేటాయింపులు లేవు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను, ఆసరా పెన్షన్ దారులను కాంగ్రెస్ ఘోరంగా మోసం చేస్తున్నది.
– కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
విజన్ లేని బడ్జెట్
బడ్జెట్లో స్పష్టమైన విజన్ లేదు. అన్ని వర్గాల ప్రజల వంచనే ధ్యేయంగా ఉన్నది. ఎకడా నూతన విధానాలను రూపొందించలేదు. రానున్న రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేక విధానాలని ఎకడికకడ ఎండగడుతాం. కాంగ్రెస్ నాయకులని ఊర్లో తిరిగే పరిస్థితి లేకుండా చేస్తాం.
– అనిల్ కూర్మాచలం, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్
అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసింది. రైతు ప్రభుత్వం అని రైతులను నట్టేటా ముంచే చర్యలను చేపడుతున్నది. బడ్జెట్లో ప్రతి ఒక రంగాన్ని నిరాశపరిచారు. చిన్న పిల్లలు పాఠం అప్పజెప్పినట్టుగా బడ్జెట్ ఉన్నది తప్ప ప్రజలకు ఉపయోగకరంగా లేదు.
-మేడే రాజీవ్‌సాగర్, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

