Minister Ponnam Prabhakar | ఇద్దరు కేంద్రమంత్రులున్నా రాష్ట్రానికి లేని ఉపయోగం: మంత్రి పొన్నం
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. కేంద్ర పర్యాటక మంత్రిగా నగరానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. అయినా ఎలాంటి సహకారం లేదని విమర్శించారు. గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయించిన కేంద్రం.. మూసీ అభివృద్ధికి మాత్రం ఎందుకు ఇవ్వదని నిలదీశారు. కారణం లేకుండానే కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, దానికి నిరసనగానే తాము ఆ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నామన్నారు. తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేట్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందని తెలిపారు. మేడిగడ్డ వద్ద నీరు పంప్ చేయడానికి అవకాశం లేదని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించిన సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. జీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రోలకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

