Ujjaini Mahankali Bonalu | ఘనంగా ఉజ్జయిని మహంకాళి భోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలిబోనం సమర్పించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర (Ujjaini Mahankali Bonalu) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు తొలిబోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చేవారికి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి అమ్మవారి దర్శనం కలిగేలా చూడాలని తెలిపారు.
ప్రజల సహకారంతో బోనాలు విజయవంతం అవుతాయని చెప్పారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందన్నారు. అమ్మవారి బోనాన్ని అలంకరించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను ప్రారంభించినట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించానని వెల్లడించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడ బోనం సమర్పించడానికి అక్కాచెల్లెళ్లు అందరూ వస్తున్నారని చెప్పారు.
కాగా, మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూలైన్లలో తమ వంతుకోసం వేచిఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఏర్పాట్లను పర్యావేక్షించారు. వీఐపీల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారిని శివసత్తులు దర్శించుకోవడానికి సమయం కేటాయించారు. సోమవారం రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగియనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

