Ponnam Prabhakar | రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం దారుణం : మంత్రి పొన్నం
Ponnam Prabhakar | దేవుడిని కూడా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలో దేవుడిని వినియోగించుకోవడం మంచి పద్ధతి కాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )అన్నారు.
రాజన్న సిరిసిల్ల : దేవుడిని కూడా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలో దేవుడిని వినియోగించుకోవడం మంచి పద్ధతి కాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి(Rajanna temple)వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడు కొందరికే సొంతం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతి లింగాలు, నాలుగు వేదాలు, నలుగురు జగద్గురులు ఉన్నారు. వాళ్ల చేతుల మీదుగా రామాలయం విగ్రహ ప్రతిష్టాపన చేయాల్సి ఉండగా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. పవిత్ర భారత దేశంలో రాజకీయాల్లో దేవుళ్లను అడ్డం పెట్టుకొని మార్కెటింగ్ చేస్తున్నారని విమర్శించారు. మేము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతిరేకం అంటున్నారు.
హిందుత్వాన్ని విశ్వసించే వారు ఆలోచన చేయాలన్నారు. దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదు అని జగద్గురువులు చెబుతున్నా వారి మాటలు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. అనాడు రాజీవ్ గాంధీ యే రాముడి చరిత్ర వెలికి తీశారని గుర్తు చేశారు. పార్లమెంట్లో అదాని, అంబానీ, గురించి ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. వేములవాడ అభివృద్ధిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

