కేంద్రం తీరు దురదృష్టకరం.. పీయూష్ గోయల్ వైఖరి అహంకారపూరితం : మంత్రి నిరంజన్ రెడ్డి
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి లేదని, కేంద్రం వివక్ష చూపుతుందని 2013లో రైతులతో సమావేశం పెట్టారు. ఈ రోజు అదే సమాఖ్య
కేంద్రం తీరు దురదృష్టకరంగా ఉందని.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వైఖరి అహంకారపూరితంగా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పీయూష్ గోయల్ దుర్మార్గపూరితంగా మాట్లాడారని… తమ కంటే ముందే పీయూష్ గోయల్ మీడియా వద్దకు ఆతృతగా వచ్చి తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. పాడిందే పాట పాసుపండ్ల దాసు అన్నట్లు కేంద్రం, నరేంద్ర మోదీ వైఖరి ఉందన్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

ఈసందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. పండిన పంట కొనుగోలు బాధ్యత అంతా కేంద్రానిదేనన్నారు. కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు. ధాన్యం సేకరణకు, పప్పు దినుసుల సేకరణకు తేడా కేంద్రానికి తెలియడం లేదు. కేంద్రం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకం. వడ్లను వడ్లలాగా సేకరించాలి.. గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా? అని మంత్రి ప్రశ్నించారు.
బీజేపీకే తెలివి ఉంది.. ఇతరులకు లేనట్లు భావిస్తున్నారు. దేశ రైతులను రోడ్డు మీద నిలబెట్టి, దాదాపు 700 మంది చావుకు కారణమైన సిగ్గులేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఆఖరుకు రైతులకు చేతులెత్తి మొక్కి క్షమాపణ చెప్పింది నిజం కాదా? తెలంగాణ బీజేపీ సన్నాసులు మేం కొనిపిస్తాం మీరు వరి వేయండి అని రైతులను రెచ్చగొట్టారు. తెలంగాణ రైతులకు మేము విజ్ఞప్తి చేసి 50 లక్షల ఎకరాల వరి సాగును 30 లక్షలకు తగ్గించాం. కేంద్రంలో ఉన్నది రైతు, పేదల ప్రభుత్వం కాదు.. పొద్దున, మాపున లెక్కలు చూసుకునే వ్యాపారాత్మక ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతుభీమా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించింది. ఇన్ని చేసినందుకు మాది రైతు వ్యతిరేక ప్రభుత్వమా? పండిన ధాన్యం కొనాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం నిరాకరించడం దుర్మార్గం. రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేస్తామన్న కేంద్రం కనీసం రైతులు పండించిన పంటలను కొనకపోవడం సిగ్గుచేటు. ఈ దేశంలో ప్రజలను అన్ని విషయాలలో కేంద్రం మోసం చేసింది. తెలంగాణ ప్రజలకు, దేశ రైతాంగానికి కేంద్రం క్షమాపణ చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని మంత్రి దుయ్యబట్టారు.

మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి లేదని, కేంద్రం వివక్ష చూపుతుందని 2013లో రైతులతో సమావేశం పెట్టారు. ఈ రోజు అదే సమాఖ్య స్ఫూర్తిని మోదీ నాయకత్వంలోని కేంద్రం దెబ్బ తీస్తున్నది. ఈ దేశ జీడీపీ పెంపుదలలో కేంద్రం విఫలమయింది. ఈ దేశంలో నిరుద్యోగం నియంత్రించడంలో కేంద్రం విఫలమయింది. ఇన్నేళ్లలో మోదీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరి దుర్మార్గం. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఈ విషయంలో ముందుకువెళ్తాం. పశుపక్ష్యాదులకు నీళ్లు లేని చోట ఎండాకాలంలో చెరువుల అలుగులు పారిస్తున్నాం. తెలంగాణ రైతులను ఆదుకున్నది కేసీఆర్ గారా? ఈ కేంద్రంలోని బీజేపీ మొనగాళ్లా? తమకు అధికారం లేని చోట ఇతర పార్టీల ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ఇబ్బందులు పెడుతున్నది. అబద్ధాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వారి మేనిఫెస్టోను చూస్తేనే ఈ విషయం బోధపడుతుంది.. అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

