వనపర్తి: ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పరిపాలనా విధానంలో కూడా శివాజీ అగ్రగణ్యుడని చెప్పారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలకు ప్రసిద్ధిచెందిన ఛత్రపతి..
17 ఏండ్ల వయసులోనే యుద్ధంచేసి బీజాపూర్ రాజ్యంలోని తోర్నకోట్ను వశం చేసుకున్నాడని చెప్పారు. ఛత్రపతి శివాజీ 391వ జయంతి సంధర్భంగా వనపర్తిలో శివాజీ విగ్రహానికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తన రాజ్యంలో మంత్రిమండలి, విదేశాంగ విధానంతోపాటు గూడఛారి వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల ప్రభువుగా పరిపాలన చేశాడన్నారు.
శివాజీ తన పాలనా కాలంలో హిందూ దేవాలయాలతో పాటు అనేక మసీదులు కట్టించారని చెప్పారు. ఆయన సైన్యంలో మూడొంతులు ముస్లింలే సైనికులుగా ఉండేవారని తెలిపారు. హైదర్ ఆలీ, ఇబ్రహీం ఖాన్, ఇబ్రహీం వంటివారు సైన్యంలో కీలక పదవులలో కొనసాగారని వెల్లడించారు.