60 ఏండ్లు దోచుకున్నారు..
- ఇకపై ఏపీ సర్కార్ ఆటలు సాగవు
- మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరిక

చిన్నంబావి, జూలై 8: ‘సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా నాయకులు కృష్ణానదిలో అధికశాతం నీటిని వినియోగించుకుని ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. 60 ఏండ్లు దోచుకున్నారు.. రాష్ట్రం విడిపోయినా ఇంకా దోచుకుంటామంటే కుదరదు. ఏపీ ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకోవాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని అమ్మాయిపల్లి, బెక్కెం గ్రామాల్లో విద్యుత్తు సబ్స్టేషన్లను నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..1985లో బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు భీమానదిలో కేటాయించిన 20 టీఎంసీల వినియోగానికి తగ్గట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా నాయకులు ఆనకట్ట నిర్మించలేదన్నారు. 15 వేల ఎకరాలకు మించి నీటిని వినియోగించలేకపోతున్నామని తెలిపారు. భీమా 27 ప్యాకేజీ ద్వారా ఈ ప్రాంతానికి నీటిని అందించడానికి కృషి చేశామన్నారు.
కృష్ణానదిపై జోగులాంబ బరాజ్..
కృష్ణానదిపై జోగులాంబ బరాజ్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రతిపాదించినట్టు మంత్రి తెలిపారు. మొత్తం 38 టీఎంసీల నికర జలాలకు గాను కృష్ణా లో 6.5 టీఎంసీలు వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని జూరాల, భీమా మీద వెలటూరు-గుందిమల్ల మధ్య కృష్ణానదిపై జోగులాంబ బరాజ్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రతిపాదించినట్టు చెప్పారు.
మంత్రి మెచ్చిన వృషభరాజం
మంత్రి నిరంజన్‌రెడ్డిని ఓ వృషభరాజం ఆకట్టుకున్నది. చిన్నంబావి మండలం బెక్కెం నుంచి వెళ్తుండగా.. పెద్దదగడ గ్రామానికి చెందిన రైతు గోపాలకృష్ణకు చెందిన వృషభరాజాన్ని చూసిన మంత్రి వెంటనే కాన్వాయిని నిలిపి అక్కడికి వెళ్లి దాన్ని ఆప్యాయంగా నిమిరారు. రైతు కోరిక మేరకు ఆ వృషభానికి లవన్న (లవుడు)గా నామకరణం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

