Minister Malla reddy : దమ్ముంటే రాజీనామా చేసి నాపై పోటీ చెయ్.. రేవంత్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్
Minister Malla reddy | కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ చీడ పురుగని ఆయనను ఎన్ని తిట్టినా దండగేనని అన్నారు.

హైదరాబాద్ : కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ చీడ పురుగని ఆయనను ఎన్ని తిట్టినా దండగేనని అన్నారు. బుధవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెలంగాణ భవన్ మంత్రి సీ మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.
ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ‘నేనెవరి నుంచి భూములను లాక్కోలేదు. రాజకీయాల్లోకి రాకముందే భూములు కొనుగోలు చేశా. రేవంత్ రెడ్డి ఓ దొంగ.. కబ్జాకోరు. మూడు చింతలపల్లిలో రూ. 62 కోట్లతో సీఎం కేసీఆర్ అన్ని రకాల అభివృద్ధి పనులు చేశారు. మూడు చింతలపల్లిని మండలంగా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వమే. మూడు చింతలపల్లిలో సమస్యలు లేవు కాబట్టే రేవంత్‌ను రావొద్దు అని అక్కడి ప్రజలు ప్లకార్డులు చూపించారు. మూడు చింతలపల్లిలో జరిగిన అభివృద్ధి కొడంగల్‌లో జరిగిందా.? రేవంత్ రెడ్డి చెప్పాలి.
మల్లారెడ్డి ఎపుడూ బ్రోకర్ దందా చేయలేదు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నా. బ్రోకరిజం చేసి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. మల్లారెడ్డి కళాశాలకు పార్లమెంటే క్లీన్ చీట్ ఇచ్చింది. నేను కబ్జా చేసినట్లు రేవంత్ నిరూపించాలి!. రేవంత్ రెడ్డి అప్పుడే సీఎం అయినట్లు మొదటి సంతకాలంటూ వాగ్ధానాలు చేస్తుండు. తెలంగాణలో అమలవుతున్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే నా పదవికి రాజీనామా చేస్తా.
కాంగ్రెస్ పార్టీ దివాళా తీసింది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటో రేవంత్ చెప్పాలి. రేవంత్ రెడ్డి మూడు చింతలపల్లి సభ పెట్టినందుకు దళితులు తిడుతున్నారు. రేవంత్ రెడ్డి ఖబడ్ధార్ ఇక రేపటి నుంచి చూసుకుంటా!. భూములను నా జేబులో పెట్టుకోని తిరుగుతలె. ఆన్లైన్లో చూస్తే అసైన్డ్ ల్యాండా.? కాదా.! అనేది తెలుస్తుంది. కావాలంటే చూసుకో రేవంత్ రెడ్డి. ఇద్దరం రాజీనామా చేద్దాం. మళ్లీ నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

