హైదరాబాద్, ఆగస్టు 10: బీహార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. కొత్త బాధ్యతలో ప్రజలకు సేవ చేయడంలో ఉత్తమంగా ఉండాలని కోరుతున్నానన్నారు. కాగా, కేటీఆర్ ట్వీట్‌కు తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘థ్యాంక్యూ బ్రదర్’ అంటూ రీట్వీట్ చేశారు.