కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి మంత్రి కేటీఆర్ స్వాగతం
Minister KTR | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బేగంపేట్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్తో పాటు పలువురు
హైదరాబాద్ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బేగంపేట్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్తో పాటు పలువురు నేతలు ఉన్నారు. కేసీఆర్ రేపు ప్రకటించబోయే జాతీయ పార్టీ కార్యక్రమంలో కుమారస్వామి పాలు పంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే కుమారస్వామి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన సీఎం కేసీఆర్తో కుమారస్వామి ప్రగతి భవన్లో సమావేశమై దేశ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే. కేసీఆర్కు ఉన్న అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కుమారస్వామి అభిప్రాయపడిన విషయం విదితమే. సకల వర్గాలతో కలిసి ముందుకు సాగి, శాంతియుతంగా ఉద్యమించి తెలంగాణను సాధించి.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేరుస్తున్నారని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో కేసీఆర్ క్రియాశీల భూమిక పోషించాలని కోరారు. ఇందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కుమారస్వామి నాడే ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

