డిసెంబర్‌లోగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోగా ప్రతిష్టిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పీవీ మార్గ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహా పనులను కేటీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత 8 నెలలుగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో పనులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు దేశానికే తలమానికంగా నిలవనున్నది. పర్యాటక రంగాన్ని ఆకర్షించేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పర్యాటక రంగం పుంజుకుంటుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ సాధ్యమైందని మంత్రి స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలు దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మహనీయుడు కలలుగన్నట్టు అందరికీ మేలు జరగాలని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

