ఆ సామెత పాతది.. మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్ : నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రధానిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు.
అయినను పోయి రావలె హస్తినకు అనేది పాత సామెత అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పక్షపాత, వివక్ష పూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సులను బుట్టదాఖలు చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్‌లో నీతి కూడా అంతే ఉందన్నారు కేటీఆర్. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారని కేటీఆర్ స్పష్టం చేశారు.
నాగేశ్వర్ ట్వీట్ ఇదే..
మహాభారతంలో సంధి కుదరదని తెలిసి కూడా శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లిన ఘటన నుంచి కేసీఆర్ జ్ఞానం పొంది ఉండాలి. ప్రధాని, ముఖ్యమంత్రులు హాజరయ్యే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం హాజరై ప్రశ్నించి ఉండాల్సిందని నాగేశ్వర్ పేర్కొన్నారు.
“అయినను పోయి రావలె హస్తినకు”అనేది పాత సామెత నాగేశ్వర్ గారు
ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పక్షపాత, వివక్ష పూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు బుట్టదాఖలు చేసింది
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందొ నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే
That’s why he chose to express dissent by Boycotting https://t.co/9cjppJnT3E
— KTR (@KTRTRS) August 8, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

