Minister KTR | నేడు మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. రూ.312 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు మంచిర్యాల (Mancherial) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
హైదరాబాద్: మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు మంచిర్యాల (Mancherial) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితోపాటు రూ.500 కోట్లతో చేపట్టనున్న ఆయిల్ పామ్ (Oil Palm) ఫ్యాక్టరీకి భూమిపూజ చేస్తారు. మందమర్రిలో భారీ రోడ్ షో, రామకృష్ణాపూర్లో ప్రగతి నివేదన సభలో మంత్రి పాల్గొంటారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మందమర్రికి చేరుకుంటారు.
భీమారం మండలం పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.14.53 కోట్లతో నిర్మించే రోడ్లు, బ్రిడ్జిలు, చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో రూ.20.40 కోట్లతో నిర్మించే పది రోడ్ల పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిచనున్నారు. అనంతరం రూ.11.70 కోట్లతో పాలవాగుపై పులిమడుగు,అందుగులపేట, సండ్రూన్పల్లి దగ్గర మూడు చోట్ల బ్రిడ్జిలు, చెన్నూ ర్ పక్కన అక్కెపెల్లి వాగుపై బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మందమర్రి మండలం శంకరపల్లిలో రూ.500 కోట్లతో నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి భూమిపూజ చేయనున్నారు. మందమర్రి మున్సిపాలిటీలో రూ.204.8 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత మార్కెట్ చౌరస్తాలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.
రోడ్ షో ముగిసిన తర్వాత క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.50కోట్లతో గాంధారి వనం సమీపంలో 250 ఎకరాల్లో నిర్మించే కేసీఆర్ అర్బన్ పార్క్ పనులకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తారు. మొత్తంగా మున్సిపాలిటీలో రూ.108.16 కోట్ల పనులు ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

