KTR | రేపో మాపో పులి బయటకు వస్తది.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
KTR | రేపో మాపో పులి బయటకు వస్తది.. వచ్చిన తర్వాత ఇవాళ ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లా తొర్రలకే పోతాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
KTR | పరకాల : రేపో మాపో పులి బయటకు వస్తది.. వచ్చిన తర్వాత ఇవాళ ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లా తొర్రలకే పోతాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ హయాంలో రూ. 200 పెన్షన్ ఇచ్చేటోళ్లు అని కేటీఆర్ గుర్తు చేశారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం రూ. 75 పెన్షన్ ఇచ్చేది. ఇవాళ మీరంతా కేసీఆర్‌ను గెలిపించుకున్న తర్వాత 200 ఉన్న పెన్షన్ 10 రెట్లు పెరిగింది. రూ. 2 వేల పెన్షన్ అయింది. దివ్యాంగులకు పెన్షన్లు పెంచాం. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చేవి. ఇప్పుడు 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. బీడీలు చుట్టే అక్కాచెళ్లెళ్లు 16 రాష్ట్రాల్లో ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారా..? ఆ దిశగా ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా..? రెండున్నర లక్షల మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా..? అని కేటీఆర్ నిలదీశారు.
మన దగ్గర ఊరికి పదో, పదిహేను మంది బీడీ కార్మికులు మిగిలిపోయి ఉంటారు.. తప్పకుండా వారిని కూడా కడుపులో పెట్టి చూసుకుంటాం.. మిగిలిపోయిన వారికి కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాది అని కేటీఆర్ స్పష్టం చేశారు. మీ మనసులో ఉన్న కోరిక కేసీఆర్‌కు తెలుసు. మీరు ఏమనుకుంటున్నారో తెలుసు. మరి కాంగ్రెసోడు కూడా చెప్పవటే కదా..? బీజేపోడు కూడా నరకవట్టే కదా..? మరి కేసీఆర్ చెప్పకపాయే.. ఏం సంగతి అని ఊర్లళ్ల ఎదురుచూస్తున్నారు.. అది మాకు తెలుసు. కేసీఆర్ మొత్తం లెక్కాపత్రం రాసుకుంటున్నారు. రేపో మాపో పులి బయటకు వస్తది. వచ్చిన తర్వాత ఇవాళ ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లా తొర్రలకే పోతాయి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి.. ఇవాళ ఎగిరెగిరి పడుతున్న నక్కలు, నీలుగుతున్న నక్కలు, మూలుగుతున్న తోడేండ్లు అన్ని మళ్లా తొర్రలకే పోతాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల వేళ ఏం ఏం చేయాలని కేసీఆర్ అన్ని లెక్కలు తీస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా బాధ్యతతో మాట్లాడుతాం. వానిది ఏం పోయింది కాంగ్రెసోనిది. నెత్తి వాన్ది కాదు.. కత్తి వాన్ది కాదు.. ఎటువడితే అటు గీకుతాడు. గెలిచేది లేదు, పీకేది లేదు. ఎటువడితే అటు మాట్లాడుడే. కాంగ్రెస్‌ను నమ్మే బుద్ది తక్కువ పరిస్థితిలో మనం ఉన్నామా? 60 ఏండ్లు మనల్ని వేధించారు. ఇవాళ వచ్చి ప్రశ్నలు వేస్తుంటే గమ్మత్తు అనిపిస్తుందని కేటీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

