Minister KTR | మొబిలిటీ రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. 2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు (E-Batteries) దేశంలోనే తయారవుతాయని చెప్పారు. గిగా కారిడార్‌లో భాగంగా హైదరాబాద్‌లోని జీఎంఆర్ (GMR) ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం జహీరాబాద్‌ను ఎంపిక చేశామని తెలిపారు. యువ నైపుణ్యాన్ని ఒడిసిపట్టడంలో టీఎస్ఐసీ కృషిచేస్తున్నదని వెల్లడించారు.
పరిశోధన, డిజైన్, ఇంజినీరింగ్ రంగాల్లో హైదరాబాద్ ముందంజలో ఉందని చెప్పారు. ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ నిలుస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్న జయదేవ్ గల్లాకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు కొత్తదనం ఉండేలా అమరరాజా కృషి చేస్తున్నదని చెప్పారు. రెండు రోజుల క్రితం కోల్డ్‌చైన్ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని తెలిపారు. ఎనర్జీ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Amararaja
- E-Batteries
- GMR
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

