KTR | ఎన్నికల తేదీలు చూస్తుంటే.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అనిపిస్తుంది : మంత్రి కేటీఆర్
KTR | ఇవాళ ప్రకటించిన ఎన్నికల తేదీలను చూస్తుంటే.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అనిపిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
KTR | వరంగల్ : ఇవాళ ప్రకటించిన ఎన్నికల తేదీలను చూస్తుంటే.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అనిపిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నవంబర్ 30 ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్.. ఈ తేదీలను చూస్తుంటే కరెక్ట్‌గా ఈసారి మనకు లెక్క కూడా కుదిరినట్టు ఉందని కేటీఆర్ తెలిపారు. 30, 03, కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుడు హ్యాట్రిక్ పక్కా అనిపిస్తుంది. మనకు అన్ని కలిసి వస్తున్నాయి. మూడు మూడు ఆరు.. మన లక్కీ నంబర్ కూడా ఆరే. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుడు కూడా పక్కానే ఉన్నది. తేదీలు కూడా మంచిగానే కుదిరినట్టు అనిపిస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎలక్షన్లు వచ్చాయి.. ఇక సంక్రాంతి పండుగకు గంగిరెద్దుళ్లోళ్లు వచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు వస్తారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చిన కథలు చెబుతారు. కేసీఆర్, ధర్మారెడ్డిని ఓడించమని చెబుతారు. విచక్షణతో, ఆలోచనతో చైతన్యాన్ని ప్రదర్శించి ఓటేయాలి. క్యాలికులేటేడ్గా ఆలోచించాలి. ఆగం కావొద్దు. 2014లో మన పరిస్థితి ఏంది..? ఇప్పుడు పరిస్థితి ఏంది? అనేది ఆలోచించాలి. కరెంట్, మంచినీళ్లు, వ్యవసాయం, సాగునీటి, సంక్షేమం గురించి ఆలోచించండి. రెచ్చగొట్టే ముచ్చట్లు చెబితే ఆగం కావొద్దు.. ఆందోళన చెందొద్దు. మేం చెప్పింది వాస్తవమైతే ధర్మారెడ్డిని 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.
కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితిని చూశామని కేటీఆర్ తెలిపారు. ఆరు గంటల కరెంట్ కూడా మూడుసార్లు ఇచ్చేవారు. దీంతో నాడు వ్యవసాయం ఆగమైంది. పరిశ్రమలు నడుపుదామంటే కరెంట్ లేదు. మరి ఇవాళ 60 ఏండ్లలో కరెంట్ ఇవ్వని కాంగ్రెస్.. ఇవాళ వచ్చి అది చేస్తా.. ఇది చేస్తా అని డైలాగులు కొడితే మోసపోదామా..? ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను పరిష్కరించిన కేసీఆర్‌కు ఓటేద్దామా? అనేది ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

