టీఎస్ బీపాస్ ద్వారా మాత్రమే నిర్మాణాలకు అనుమతి : మంత్రి కేటీఆర్
హనుమకొండ : వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబందించిన మున్సిపాలిటీల అభివృద్ధి గురించి హనుమకొండ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు టీఎస్ బీపాస్ ద్వారా మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లతో పాటు వైకుంఠధామం నిర్మించాలని ఆదేశించారు.
గ్రీన్ బడ్జెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధునిక దోబీ ఘాట్లు నిర్మాణం కావాలన్నారు. బయో మైనింగ్ ద్వారా డంప్ యార్డులో చెత్త నిర్వీర్యం చేయాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో మానవ వ్యర్థాల శుద్దీకరణ ప్లాంట్ నిర్మించాలన్నారు. పేదలకు రూపాయి నల్లా కనెక్షన్ ఇవ్వాలి. అన్ని పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి కావాలని ఆదేశించారు. డిజిటల్ డోర్ నంబరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

