అభివృద్ధే కులం.. సంక్షేమమే మతం.. జనహితమే అభిమతం..
Minister KTR | అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమతం.. అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎనిమిదేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు
రంగారెడ్డి : అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమతం.. అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎనిమిదేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ చెప్పింది ఒక్కటే. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తేనే మన జన్మ ధన్యమైతదని చెప్పారు. కులం, మతలం అని చూడలేదు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతం, జనహితమే మన అభిమతం అని చెప్పి ముందుకు పోతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన లారీ యజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ తెలంగాణలో దేశంలో ఎక్కడాలేని సంకక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పేదరికమే ప్రతిపాదికగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. పారిశ్రామికవేత్తల నుంచి మొదలుకొంటే కార్మికులు, శ్రామికుల బాగోగులు చూస్తున్నాం. నాడు ఉద్యమంలో ఉన్న సమయంలో.. మా దోస్తులు అనేవారు. మీకు తెలంగాణ వస్తే రాష్ట్రనాన్ని ముందుకు తీసుకుపోయే దమ్మున్న నాయకత్వం మీకు ఉందా? అని అడిగేవారు. కానీ ఇవాళ చూస్తుంటే ప్రపంచంలో ఉన్న నగరాలను దాటుకొని, మన హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. అది మన దమ్ము. మన కేసీఆర్ నాయకత్వ పటిమకు ఈ అవార్డు నిదర్శనమని కేటీఆర్ చెప్పారు.
ఇవాళ కరెంట్ కోసం తిప్పలు లేదు. విద్యుత్ లేక ఆగమాగం అయిపోయిన పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహ వినియోగానికి ఇవాళ నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కరెంట్, తాగునీటి సమస్య పరిష్కరించాం. దశాబ్దాల నుంచి ఉన్న ఫ్లోరోసిస్ వ్యాధిని రూపుమాపాం. వ్యవసాయం పండుగలా మారింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నాం. కాళేశ్వరం కట్టాం. పాలమూరు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మూడున్నర కోట్ల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం. ఇది కదా తెలంగాణ దమ్ము అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

