వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే: మంత్రి కేటీఆర్
Minister KTR | వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై
హైదరాబాద్: వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడులకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అందరికి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మన్యం వీరుడి జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.

జల్ జంగల్ జమీన్ నినాదంతో కుమ్రం భీమ్ ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం నాటి నిజాం ప్రభువు పై తెగించి పోరాడారని చెప్పారు. అదేవిధంగా తెలుగుజాతిని ప్రభావితం చేసేలా అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై దీరోధాత్తంగా పోరాటంసలిపారని వెల్లడించారు. అలాంటి వీరుల స్ఫూర్తితో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. నగరంలోని ఖానామెట్‌లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడెకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు గొప్ప వీరుడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. అల్లూరి జయంతి వేడుకలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతవరకు అధికారికంగా జరుగలేదని ఇదే మొదటిసారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

