హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్ అమెరికాకు వెళ్లిన తన కొడుకు హిమాన్షును గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విటర్ (X) లో హిమాన్షుతో జాగింగ్ చేస్తూ దిగిన పాత ఫొటో ఒకదాన్ని షేర్ చేశాడు. ఆ ఫొటోతో పాటు ‘ఈ పిల్లగాడిని మిస్సవుతున్నా (Missing this kid)’ అనే క్యాప్షన్‌ను మంత్రి ఇచ్చారు. క్యాప్షన్ పక్కన లవ్ సింబల్‌ను జత చేశారు.
కాగా, మంత్రి కేటీఆర్ గతంలో కూడా తన కుమారుడి గురించి ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. హిమాన్షు అమెరికాకు ఒంటరిగా వెళ్లడం లేదని, అతనితోపాటు తనలోని కొంత భాగాన్ని కూడా తీసుకెళ్తున్నాడని ఆ ఎమోషనల్ ట్వీట్లో మంత్రి పేర్కొన్నారు.
Missing this kid ❤️ pic.twitter.com/3I8uwdjlxW
— KTR (@KTRBRS) October 10, 2023