KTR | అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటల రాజేందర్, జగ్గారెడ్డితో మంత్రి కేటీఆర్ ముచ్చట్లు..
KTR | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సరదాగా ముచ్చటించారు.

శాసనసభలో మంత్రి కేటీఆర్.. ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం ఈటలను ఆలింగనం చేసుకున్నారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్, ఈటల సుమారు పది నిమిషాల పాటు ముచ్చటించారు.

ఇక అసెంబ్లీ వెలుపల కేటీఆర్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య సరదా చర్చ జరిగింది. టీ షర్ట్‌లో ఉన్న జగ్గారెడ్డిని చూసి పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లన్న..? అని కేటీఆర్ అనగా, టీషర్ట్ వేసుకుంటే పిల్లలవుతారా? అని జగ్గారెడ్డి అడిగారు. అప్పటికే జగ్గారెడ్డితో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ కలిసి ఉండగా, మీ ఇద్దరికి ఎక్కడ దోస్తాన్ కుదిరింది అని కేటీఆర్ అడిగారు. దీంతో మాది ఒకే కంచం, ఒకే మంచమని మామిల్ల రాజేందర్ జవాబిచ్చారు. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తావా..? అని కేటీఆర్ ప్రశ్నించగా, సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తా.. మన దగ్గరకు పట్టుకొస్తా అని రాజేందర్ సరదాగా వ్యాఖ్యానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!