వైద్యసిబ్బంది దేవుళ్లు
- మొబైల్ మెడికల్ బస్సులు భేష్
- లార్డ్స్చర్చి బృందానికి అభినందనలు: మంత్రి కేటీఆర్
- ట్యాంక్‌బండ్‌పై 30 అధునాతన బస్సుల ప్రారంభం

హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కరోనాకాలంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు అందిస్తున్న వైద్యసిబ్బంది దేవుళ్లతో సమానమని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు కొనియాడారు. వైద్యసిబ్బంది అంతా ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు సేవచేయాలని సూచించారు. దేశంలోనే తొలి మొబైల్ మెడికల్ యూనిట్, మొబైల్ ఐసీయూ యూనిట్ బస్సులను గురువారం ట్యాంక్‌బండ్‌పై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పెద్దమొత్తంలో నిధులు సేకరించి 30 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన లార్డ్స్ చర్చి బృందానికి, వారికి సహకరించిన వెర హెల్త్ కేర్ సర్వీసెస్, వైద్య సిబ్బందిని అభినందించారు. మొదట ఈ ఆలోచన గురించి చెప్పినప్పుడు తాను ఆశ్చర్యపోయానని, ఇంత త్వరగా చేయగలరా? అని సందేహిస్తే.. అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారని గుర్తుచేసుకొన్నారు.
ఇలాంటి సేవ దేశంలోనే తొలిసారి అని అన్నారు. తొలి విడతలో 30, రెండో విడతలో మరో30 బస్సులు ఒక్కో జిల్లాకు రెండు చొప్పున అందుబాటులోకి తేవచ్చని సూచించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ వంటి దూర ప్రాంతాలకు ఒక్కో మొబైల్ మెడికల్ యూనిట్‌ను పంపి సేవలు అందించవచ్చని చెప్పారు. ఒక్కో బస్సులో 8 బెడ్లు, ఆక్సిజన్, కాన్సన్ట్రేటర్లు, ఇన్‌వైజ్ వెంటిలేటర్ ఏర్పాట్లు అద్భుతమని పేర్కొన్నారు. ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు అందుబాటులో ఉంటారని చెప్పారు. కరోనాను ఎదుర్కోడానికి సహకారం అందించేందుకు ముందుకొచ్చిన లార్డ్స్ చర్చి బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు గోవర్ధన్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, ఫాస్టర్ ఆఫ్ ది లార్డ్స్ చర్చి రాజ్‌ప్రకాశ్ పౌల్ తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

