మళ్లీ తెలంగాణదే ఘన విజయం
ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా, మళ్లీ తెలంగాణదే ఘన విజయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
- ‘దారి చూపిన దశాబ్ది’ సంకలనాన్ని ఆవిషరించిన మంత్రి కేటీఆర్
- రచయిత, శాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్‌కు అభినందనలు
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా, మళ్లీ తెలంగాణదే ఘన విజయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ప్రగతి భవన్లో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ వ్యాసాల సంకలనం ‘దారి చూపిన దశాబ్ది’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిషరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పదేండ్ల రాష్ట్ర ప్రగతిపథం దేశ పాలనా చరిత్రలో నూతన అధ్యాయమని పేర్కొన్నారు. సాగు, సంక్షేమ, పారిశ్రామిక రంగాల్లో సీఎం కేసీఆర్ అమలుచేసిన విధానాలు అద్భుత ఫలితాలనిచ్చాయని చెప్పారు. తన వ్యాసాల ద్వారా తెలంగాణ రాష్ట్ర పురోగతిని వివరించడంతోపాటు, బీజేపీ, కాంగ్రెస్‌ల అమానవీయ రాజకీయ నైజాన్ని బహిర్గతం చేస్తున్న ఆంజనేయ గౌడ్ కృషి ప్రశంసనీయమని అభినందించారు. అనంతరం ఆంజనేయ గౌడ్ సారథ్యంలో పాలమూరు గాయకుడు రేలారే ప్రసాద్ రచించి, ఆలాపించిన ‘గుండెకత్తుకుందమా.. గులాబీ జెండా ను’ పాటను కేటీఆర్ ఆవిషరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

