డయల్ ఏ సెప్టిక్ ట్యాంకర్లు ప్రారంభం.. టోల్ ఫ్రీ నంబర్ 155313
డయల్ ఏ సెప్టిక్ ట్యాంకర్లు | స్వచ్ఛ హైదరాబాద్ దిశగా మరో ముందడుగు పడింది. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జలమండలి ప్రయత్నిస్తోంది.

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్ దిశగా మరో ముందడుగు పడింది. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జలమండలి ప్రయత్నిస్తోంది. క్రమంలో భాగంగా డయల్ ఏ సెప్టిక్ ట్యాంకర్లను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ వాహనాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 155313కు డయల్ చేయొచ్చు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందించదగ్గ విషయమన్నారు. నాగరికమైన పద్ధతుల్లో పట్టణాల్లో ప్రజలు జీవించాలి. పరిశుభ్రమైన వాతావరణంలో మన పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. మానవ వ్యర్థాలను సరైన పద్ధతిలో శుద్ధి చేయకపోతే రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యర్థాలను శాస్ర్తీయమైన పద్దతుల్లో శుద్ధి చేయాలన్నారు. నాలాల క్లీనింగ్ కోసం కొత్త వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కాల్వల్లో మానవ వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశంలోనే ఇది అతిపెద్ద ప్రయత్నమన్నారు. వినూత్న ఆలోచనలు అమలు చేస్తూ క్లీన్ హైదరాబాద్ కోసం పాటుపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. మిగతా నగరాలకు హైదరాబాద్ ఆదర్శంగా నిలిచిందన్నారు. 71 చోట్ల ఎఫ్ఎస్టీపీలను నిర్మిస్తున్నాం. త్వరలో మరో 68 నిర్మిస్తామని ప్రకటించారు. ఈ నూతన వాహనాల్లో పరిమితమైన ఛార్జీలతో మానవ వ్యర్థాలను తరలిస్తారని, పేద ప్రజలు ఉండే చోట తక్కువ ఛార్జీలను నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

