అగ్రిహబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ | ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్ హబ్‌ను మంత్రి కేటీఆర్ ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఉత్పత్తులను పరిశీలించారు.

హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్ హబ్‌ను మంత్రి కేటీఆర్ ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఉత్పత్తులను పరిశీలించారు. రూ.9 కోట్ల నాబార్డ్ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమంలో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

వ్యవసాయరంగంలో ఇన్నొవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు అగ్రిహబ్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేయనున్న హబ్ సేవలను గ్రామీణ ప్రాంతాల రైతులకు చేరువచేసేందుకు జగిత్యాల, వరంగల్, వికారాబాద్‌లో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అగ్రిహబ్‌ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, డ్రోన్ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. గ్రామీణయువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రిబిజినెస్ మెళకువలు నేర్చుకునేందుకు గ్రంథాలయంగా ఉపయోగపడుతుంది. నాణ్యతగల విత్తనాలు, మొక్కలకు కావల్సిన ఎరువులు, పురుగుమందులు, పంట దిగుబడి తదితర వివరాలు అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

