మోదీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు : మంత్రి కేటీఆర్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వస్తుందేమోనని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలు తిరగబడే రోజులు తప్పకుండా వస్తాయన్నారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు.. మోదీ రాజ్యాంగం అమలవుతుందని నిప్పులు చెరిగారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగ పరిరక్షణకు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తారనే సంపూర్ణ విశ్వాసంతో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపామని కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణగా మద్దతు ప్రకటించాం. యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ రావాలని ఆహ్వానించాం. హైదరాబాద్‌లో తమ ఎంపీలు, శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు మద్దతు తెలుపుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఒక నియంతలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం..
కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలా వ్యవహరిస్తోంది. నిరంకుశ విధానాలతో, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ.. గత 8 ఏండ్ల నుంచి ఆయా రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 8 రాష్ట్రాల్లో వారికి మెజార్టీ లేకపోయినా ఆయా ప్రభుత్వాలను తలకిందులు చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రాజ్యాంగ సంస్థలను వేటకుక్కల్లా ఉసిగొల్పుతున్నారు..
రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లో ఉంచుకొని విపక్షాల మీద వేటకుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారని ప్రధాని మోదీపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాన్ని తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న అన్ని పార్టీలకు ఉంటుందన్నారు. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నామని తేల్చిచెప్పారు. బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వైఖరికి వ్యతిరేకంగా, అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. యశ్వంత్ సిన్హా గెలువాలని, రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
13 మంది గిరిజనులను కాల్చి చంపినప్పుడు ముర్ము ఎందుకు నోరు మెదపలేదు..
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా మాకు ఇబ్బంది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆవిడ మంచి వ్యక్తే కావొచ్చు. గిరిజన, మహిళా అభ్యర్థిని చెప్పడం సరికాదు. జనవరి 2, 2006లో ఒడిశాలో కళింగనగర్‌లో స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళన చేస్తున్న 13 మంది గిరిజనులను కాల్చిచంపారు. అప్పటి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. ద్రౌపది నాడు మంత్రి కూడా. నాడు ఆమె ఎలాంటి సానుభూతి తెలుపలేదు. గిరిజనులకు అన్యాయం జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజంగానే గిరిజనులపై ప్రేమ ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను పెంచాలని కోరుతున్నాం. ఒక వేళ నిజంగానే గిరిజనులపై ప్రేమ ఉంటే ఇప్పటి వరకు చేసి ఉండాలి. కానీ ఉలుకు పలుకు లేదు. ట్రైబల్ యూనివర్సిటీ పెడుతామని పునర్విభజన చట్టంలో చెప్పారు. ఈ రోజు వరకు అతీగతీ లేదు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. బీజేపీ వ్యవహారం దేశంలోని గిరిజనులకు, తెలంగాణలోని గిరిజనులకు బాగా తెలుసు. చిత్తశుద్ధి ఉంటే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్లను పెంచాలి. ఏడు మండలాలను తిరిగి వెనక్కి ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

