Minister KTR | లోపభూయిష్టంగా కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్: మంత్రి కేటీఆర్
Minister KTR | కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి.. మైనారిటీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుట్రచేస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి.. మైనారిటీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుట్రచేస్తోందని ఆరోపించారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కోత్తేమీ కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, అలా చేస్తే మైనారిటీలు ప్రత్యేక హోదా పోతుందని అన్నారు. మైనారిటీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు.
ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు రాజ్యాంగపరంగా మతపరమైన మైనారిటీలని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యి ఆటలాడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ముఖ్య నేతల సీట్లలో కాంగ్రెస్ పార్టీ వీక్ క్యాండిడేట్స్‌ను నిలబెట్టిందన్నారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కోసం ఏం చేసిందని మంత్రి ప్రశ్నించారు. పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కోసం కేవలం రూ.930 కోట్లు ఇస్తే.. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

