హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) పార్లమెంట్ ఎన్నికల్లో (MP contests) పోటీ చేయడంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) స్పందించారు. దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేస్తే సమస్యలు ఉత్నన్నమయ్యే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ గుర్తుపై పోటీ చేస్తే లీగల్గా సమస్యలు వస్తాయన్నారు.
కాగా, దానం కాంగ్రెస్లో చేరడంపై మొదటి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. తనను సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలపడంపై స్థానిక నాయకులు ఏ మాత్రం జీర్ణించు కోలేక పోతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే పోటీ చేయాలని ఆ పార్టీ నేత రాజు యాదవ్ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసింది. దానం పోటీపై ఆ పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.