పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
సమాజాన్ని ఒక క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సాంప్రదాయాల పాత్ర కీలకమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజలను ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడుతాయని చెప్పారు.
సూర్యాపేట: సమాజాన్ని ఒక క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సాంప్రదాయాల పాత్ర కీలకమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజలను ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడుతాయని చెప్పారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరకు ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. సూర్యాపేటలోని గొల్ల బజార్ ఎల్లమ్మ గుడిలో పెద్దగట్టు జాతరలో తొలి ఘట్టమైన మకర తోరణం తరలిపు ప్రక్రియను ప్రత్యేక పూజలు చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి భేరీలు వాయించారు. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలు, మతాలకు సమన్యాయం కల్పించామన్నారు.
ఆదివారం రాత్రి కేసారం నుంచి దేవర పెట్టే తరలింపు ప్రక్రియ ఉంటుందని చెప్పారు. సోమవారం నుంచి జాతరకు భక్తులు వస్తారని వెల్లడించారు. మూడు రోజులపాటు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా 15 లక్షల మంది భక్తులు వస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు
దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమై.. 9వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో హైదరాబాద్ – విజయవాడ హైవే(NH 65) పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులు.. టేకుమట్ల నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. ఈ వాహనాలన్నీ నామాపురం వద్ద జాతీయ రహదారి 65పై కలుస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనదారులను రోళ్లబావి తండా వద్ద మళ్లించనున్నారు. రయాన్గూడెం వద్ద హైవేపై కలుస్తాయి.

హెవీ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌ను కోదాడ వద్ద మళ్లించి, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు పంపించనున్నారు. మొత్తంగా లింగమంతుల స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పెద్దగట్టు జాతరకు రూ. 6.5 కోట్లు కేటాయించారు. మహిళలకు ప్రత్యేక స్నానపు గదులు, చేజింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి కల్పించారు. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు, అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

