పీఆర్టీయూ నూతన కమిటీని అభినందించిన మంత్రి జగదీశ్ రెడ్డి
మంత్రి జగదీశ్ రెడ్డి | తెలంగాణ విద్యా విధానం యావత్ దేశానికి మార్గదర్శకం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.

నల్లగొండ : తెలంగాణ విద్యా విధానం యావత్ దేశానికి మార్గదర్శకం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత శ్రమించాలని ఆయన కోరారు. కరోనాతో విద్యారంగం ఒకింత ఇబ్బంది పడిందన్నారు.
నల్లగొండ జిల్లా పంచాయతీ రాజ్ ఉపాధ్యాయ సంఘానికి (పీఆర్టీయూ) ఎన్నికైన నూతన కమిటీ మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి జగదీష్ రెడ్డిని కలిసింది.
ఈ సందర్భంగా నూతన కమిటీని మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. కరోనా వంటి పరిస్థితులను అధిగమించి విద్యార్థులకు విద్యానందిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం బలోపేతం అవుతుందన్నారు. గురుకులాల ద్వారా అందిస్తున్న విద్య అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు.
పీఆర్టీయూ కమిటీని ఆయన ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, కమిటీ నూతన అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శి కాళం నారాయణ రెడ్డితో పాటు మాజీ ప్రధాన కార్యదర్శులు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, కోమటిరెడ్డి నరసింహా రెడ్డి, భసిరెడ్డి రవీందర్ రెడ్డి, ఫణికుమార్, మేకల జానారెడ్డి , జేవీ గౌడ్, యూసుఫ్, రమణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

