ధరణి పోర్టల్‌తో అవినీతి తగ్గింది.. పారదర్శకత పెరిగింది : మంత్రి హరీశ్‌రావు
Minister Harish rao | భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై అడ్డగోలు మాట్లాడటం సరికాదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆ పోర్టల్ గురించి తెలుసుకోకుండా
కామారెడ్డి : భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై అడ్డగోలు మాట్లాడటం సరికాదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆ పోర్టల్ గురించి తెలుసుకోకుండా కొంత మంది మూర్ఖులు ఏదేదో వాగుతున్నారని మండిపడ్డారు. రూపాయి లంచం లేకుండా పట్టా పాస్ పుస్తకాలు ఇంటికి వస్తున్నాయి. త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలను పరిష్కారిస్తామన్నారు. ధరణితో అవినీతి తగ్గింది. పారదర్శకత పెరిగింది. వేగవంతమైన పాలన అందుతుందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల అధికారులు కూడా ధరణి పోర్టల్‌ను చూసి చాలా నేర్చుకున్నారని తెలిపారు.

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైన డోంగ్లి మండలాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మండల కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. డోంగ్లి మండలం ఏర్పాటు ఎన్నో ఏళ్ల కల. ఆ కలను నిజం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 466 మండలాలను 612 కుపెంచామన్నారు.
టీడీపీ పోయి, కాంగ్రెస్ వచ్చింది. నీళ్ళ బాధ పోలేదు. టీఆర్ఎస్ వచ్చాకే నీళ్ళ బాధలు పోయాయని మంత్రి గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. హర్ ఘర్ కో జల్ పేరిట దేశం మొత్తం అమలు చేస్తున్నారు. చెరువులు బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నారు. రైతు బంధు కాపీ కొట్టి, కిసాన్ సమ్మన్ యోజన ద్వార ఇస్తున్నారు. నాందేడ్ నుండి సర్పంచులు వచ్చి మమ్మల్ని తెలంగాణలో కలపాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

